![]() |
![]() |

2013 నుంచి జబర్దస్త్ 2014 నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి.. అప్పట్లో గురు, శుక్రవారం వచ్చిదంటే చాలు అందరూ టీవీల ముందు కూర్చుని కమెడియన్స్ స్కిట్స్ కి కడుపుబ్బా నవ్వుకునే వాళ్ళు. ఈ రెండు కామెడీ షోస్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. సుధీర్, రష్మీ, ఆటో రాంప్రసాద్, ఆది లాంటి వాళ్ళు ఎంతో మందికి ఉపాధితో పాటు ఒక స్పెషల్ ఐడెంటిటీని కూడా ఈ రెండు షోస్ ఇచ్చాయి. వీళ్ళు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు...సిల్వర్ స్క్రీన్ మీద కూడా హీరోస్ గా, రైటర్స్ గా, డైరెక్టర్స్ గా వెలుగుతున్నారు.
అలాంటి ఈ షోస్ లో ఇప్పుడు ఒక కొన్ని మార్పులు చేశారు. రీసెంట్ గా రిలీజయిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. ఇందులో ఆ మార్పులను వివరిస్తూ రామ్ ప్రసాద్ ఒక స్కిట్ చేసాడు. ఇక ఖుష్బూ, రష్మీ కన్నీళ్లు పెట్టుకున్నారు. " మాకో రెండు కంపెనీలు ఉన్నాయండి..ఆ రెండు కలిపి ఒకటిగా చేసేస్తాం అంటున్నారు. నేనేమో ఈ కంపెనీలోనే మొదటి నుంచి ఉన్నాను.. సడెన్ గా ఒక కంపెనీ వెళ్లిపోతుంటే బాధగా ఉంది..ఎక్కడికెళ్లినా డబ్బు సంపాదిస్తాం కానీ ఈ కంపెనీలో ఉంటే సంతోషం ఉంటుంది...మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసు కదా..ఇప్పుడు ఈ కంపెనీ మూసేస్తుంటే ఇంటి పేరును మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సర్ " అని రాంప్రసాద్ చెప్పిన ఎమోషనల్ వర్డ్స్ తో అందరూ ఏడ్చేశారు.
ఇక స్టేజి మీదకు రష్మీ వచ్చి "వచ్చే వారం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా అనే పదం మిస్ అవుతుంది. ప్రతీ శుక్ర, శని వారాల్లో సరి కొత్త ప్యాకేజీతో సేమ్ జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ తో" అంటూ ఫైనల్ లో చెప్పింది. ఇలా ఈ ప్రోమో ఎండ్ అయ్యింది. ఏమయ్యిందో కానీ జబర్దస్త్ జడ్జ్ గా ఇంద్రజ వెళ్ళిపోయింది. ఇప్పుడు జబర్దస్త్ రెండు షోస్ ని కలిపి ఒకటిగా చేసేసి వీకెండ్స్ లోకి మార్చేశారు.
![]() |
![]() |